Monday, December 24, 2012

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు .... ప్రేమ సంకెళ్ళు (1982)


పల్లవి :
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలోగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలోగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు

చరణం : 1
మల్లెల కన్నీరు చూడు..మంచులా కురిసింది
లేత ఎండల నీడలలో నీ నవ్వే కనిపించింది
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
దొసిట నా ఆశలన్నీ..దోచి వెళ్ళిపొయావు
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలోగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు

చరణం : 2
ప్రాణాలన్నీ నీకై చలి వేణువైనాయీ
ఊపిరి ఊయలూగే ఎదే మూగ సన్నాయి
ప్రాణాలన్నీ నీకై చలి వేణువైనాయీ
ఊపిరి ఊయలూగే ఎదే మూగ సన్నాయి
పసుపైనా కానీవా..పదాలంటుకొనీవా పాదాలకు
పారాణై పరవశించిపొనీవా...పలకరించి పోలేవా..

చరణం : 3
వెకువంటి చీకటి మీద చందమామ జారింది
నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
తెల్లారని రాతిరిలా..వేకువలో వెన్నెలలా
తెల్లారని రాతిరిలా..వేకువలో వెన్నెలలా
జ్ఞాపకాల వెళ్ళువలోనే..కరిగి చెరిగి పోతున్నాను

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలోగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలోగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు


చిత్రం : ప్రేమ సంకెళ్ళు (1982)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం :  S.P.బాలు , P.సుశీల
***********************************
Movie Name : Prema Sankellu (1982)
Music Director : Ramesh Naidu
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : S.P.Balu , P.Susheela

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...