పల్లవి
ఈ అనంత కాల గమనంలో
ఈ రవ్వంత జీవన పయనంలో
అందరు నీవారు..చివరకు మిగిలేదెవరు లేరు
చరణం :
నీ కడుపున చీకటి దాచుకొని
కన్నీరే చమురుగ చేసికొని
నీ కొర్కెలు నిలువునా కాల్చుకొని
వెలుగును పంచావందరికి
నీ వేదన తెలిసిందెవరికి
చరణం :
చేతికి తమ్ముడు అందోస్తాడని
చెట్టుకు తానొక వేరౌతాడని
చేసిన త్యగం చేయి దాటిందా
రెక్కలు వస్తే అంతేనమ్మా
నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా
చరణం :
నీ అలసట తీర్చే ఓడి ఒకటుందని
నీ అనురగనికి గుడి తాననుకొని
వేచావమ్మా ఆశలు దాచుకొని..
దేవుడు తలుపులు మూసడా
నీ దీపం నేటితో కొండెక్కిందా
చరణం
అందరి నొసలు ఒకటేనమ్మా
అందరి రాతలు వెరౌనమ్మా
కొందరి బ్రతుకులు అందరి కోసమని
రాసినివాడికే తెలియాలి
కధ ముగింపు వాడే తేల్చాలి
చిత్రం : సంధ్య (1980)
సంగీతం : చక్రవర్తి
రచన : ఆత్రేయ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
********************************
Movie Name : Sandhya (1980)
Music Director : Chakravarthy
Lyricist : Aathreya
Singer : S.P.Bala Subramanyam
No comments:
Post a Comment